NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలీసుల సేవలు వెలకట్టలేం..

1 min read

– టీడీపీ కడప అసెంబ్లీ ఇంచార్జి వి.ఎస్.అమీర్ బాబు
పల్లెవెలుగు వెబ్​, కడప బ్యూరో : కరోన విపత్కర పరిస్థితిలో పోలీసులసేవలు వెలకట్టలేనివని టీడీపీ కడప అసెంబ్లీ ఇంచార్జి, వి.ఎస్.అమీర్ బాబు కొనియాడారు. పోలీసుల సేవలను గుర్తించి .. బుధవారం కడప శివారులోని రిమ్స్​ఔట్​ పోస్ట్​ పోలీసులను శాలువాతో సత్కరించి.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వి.ఎస్.అమీర్ బాబు మాట్లాడుతూ… కరోనా కోరలు చాచి విషం కక్కుతున్న విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పారమెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల మాదిరిగానే పోలీసు అధికారుల సేవలు వెలకట్టలేనిదని అన్నారు. తమ కుటుంబ బాధ్యతలను కూడా వదిలి నిస్వార్థంగా రాత్రిపగలూ సేవ చేశారని ప్రశంసించారు పోలీసు అధికారులను సత్కరించటం మహదావకాశంగా భావిస్తున్నానని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో కడప నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్, జయశేఖర్, నాసిర్ అలీ, జనార్ధన్ రెడ్డి, ఛాన్ బాష, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author