NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమాజంలో పోలీస్ సేవలు చిరస్మరణీయం :ఎంపీ

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: కర్నూలు నగరంలో APSP సెకండ్ బెటాలియన్ నందు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు అమరవీరుల స్థూపానికి ఎంపీ గారు నివాళులర్పించారు .ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ దేశం కోసం సమాజం కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవడం మన బాధ్యత వారి ఆశయాలను ప్రతిబింబంగా ప్రతి ఒక పోలీసు ఉన్నతమైన విలువలతో ప్రజలకు సేవలు అందించాలని అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ గారు తెలిపారు అదేవిధంగా APSP సెకండ్ బెటాలియన్ నందు మెమోరియల్ హాల్ కు ఎంపీ నిధుల నుంచి 35 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ఎంపీ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో APSP కమాండెంట్ రవి శంకర్ గారు, అడిషనల్ కమాండెంట్,RI,RSI,మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

About Author