NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేయాలని ఆత్మకూరు డిఎస్పీ ఏ. శ్రీనివాసరావు అన్నారు. గురువారం నందికొట్కూరు సర్కిల్ కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.రాజమండ్రి నార్త్ జోన్ బాపట్ల లో ఇంటలిజెన్స్ డిఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న ఆయనను బదిలీలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల జిల్లా ఆత్మకూరు జోన్ కు డిఎస్పీ గా బదిలీ చేశారు. బుధవారం ఆత్మకూరు డిఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.ఈ నేపథ్యంలో గురువారం నందికొట్కూరు సర్కిల్ పోలీసు కార్యాలయానికి వచ్చిన ఆయనకు పట్టణ సీఐ విజయ భాస్కర్, రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి ల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, పోలీసు సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర వహించాలన్నారు. గ్రామాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. కేసులకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడూ అప్‌డేట్‌ చేయాలని సూచించారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author