NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలీస్ స్టేషన్ అకస్మికంగా తనిఖీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కడప : సిద్ధవటం జిల్లాలోని సిద్దవటం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు, అలాగే పోలీస్ స్టేషన్ పరిసరాల ను ఆయన పరిశీలించారు, ఆవరణలో పచ్చదనం పెంపొందించాలని, అదేవిధంగా ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత పోలీస్ సిబ్బంది పై ఉంది అన్నారు,అనంతరం పోలీస్ స్టేషన్ లోని రికార్డులను ఆయన పరిశీలించారు…పెండింగ్ కేసులు త్వరతగతిన పరిష్కరించాలని, ఎర్ర చందనం అక్రమ రవాణా కు సంబందించిన కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్సై తులసి నాగప్రసాద్ ను ఆదేశించారు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను త్వరితగతిన డిస్పోజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని, వాహనదారులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ‘దిశ’ రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించారు, ఈ సందర్భంగా ఎస్.ఐ తులసి నాగప్రసాద్ కు పలు సూచనలు చేశారు.

About Author