PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసుల బదిలీ…పారదర్శకం…

1 min read

10 మంది ఎఎస్సైలు , 33 మంది హెడ్ కానిస్టేబుల్స్,   180 మంది కానిస్టేబుల్స్ )

పల్లెవెలుగు వెబ్​: పోలీసుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేశామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు తెలిపారు. ఖాళీలకు అనుగుణంగా పోలీసుస్టేషన్ లను ఎంపిక చేసుకోవాలని  సిబ్బందికి సూచించారు.  జిల్లా వ్యాప్తంగా  పోలీస్ స్టేషన్లు, ఆయా విభాగాల్లో ఒకే చోట 5 సంవత్సరాలు  పూర్తి చేస్తుకున్న  కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ స్థాయి వరకు ఉన్న పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపియస్  గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్  ప్రసాద్  గారితో కలిసి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో  పోలీసుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్ లు, ఆయా విభాగాలలోని ఖాళీల వివరాలను వ్యాస్ ఆడిటోరియం వెలుపల  అతికించి సిబ్బంది సులువుగా ఎంపిక చేసుకునే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేశారు.  ఒక్కొక్కరిని పిలిచి ఇదివరకు పనిచేసిన సర్కిల్ పరిధిలోని  పోలీస్ స్టేషన్ , స్వంత మండలం కాకుండా  మిగిలిన పోలీస్ స్టేషన్ లలో ఉన్న ఖాళీల ఆధారంగా ప్రోజెక్టర్ లలో  చూపించి  వారు కోరుకున్న చోటికి బదిలీ చేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడారు… ప్రతి శుక్రవారం పోలీసుల సమస్యల పై  పోలీసు గ్రీవియెన్స్ డే నిర్వహిస్తామన్నారు.  సిబ్బంది నేరుగా వచ్చి జిల్లా ఎస్పీ గారిని కలిసి తమ సమస్యలను విన్నవించి పరిష్కరించుకోవచ్చన్నారు. ఏమైనా మెడికల్ సంబంధిత సమస్యలుంటే  గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ తో కమిటి ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ చేసుకుని పరిగణనలోనికి తీసుకుని పరిష్కరిస్తామన్నారు.  డిజిపి చీఫ్ ఆఫీస్  ఉత్తర్వల మేరకే సాధారణ బదిలీలలో భాగంగా పోలీసుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టామన్నారు. ఈ బదిలీల ప్రక్రియలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, డిపిఓ ఏఒ సురేష్ బాబు, డిపిఓ సిబ్బంది  పాల్గొన్నారు.

About Author