సబ్ కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాల మహానాడు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఆదోని సబ్ కలెక్టర్ శివ నారాయణ శర్మని మాల మహానాడు జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా పూలమాల శాలువాలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా దళితులపై జరుగుతున్న దాడులను మాల మహానాడు నాయకులు సబ్ కలెక్టర్ కి వివరించారు. అలాగే జీవో నెంబర్ 53 ని మాదాసి కురువ మదారి కురువ ఎస్సి సర్టిఫికెట్ను రద్దు చేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కార్యదర్శి వన్నూరప్ప మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కురుకుంద గోపాల్ మాల మహానాడు జిల్లా యూత్ ప్రెసిడెంట్ వెంకటరాముడు మాల మహానాడు నాయకులు ఆది కేశవ తదితరులు పాల్లొన్నారు.