PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజకీయ లబ్ది కోసం సొంత బాబాయ్ నే హత్య చేసిన వ్యక్తి జగన్

1 min read

ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వివేకా హత్య కేసులో జగస్ రెడ్డి పాత్రపై విచారణ పూర్తి స్థాయిలో జరగాలనీ, గొడ్డలి పోటుతోనే బాబాయి చనిపోయారు అని జగన్ రెడ్డి అంత కచ్చితంగా ఎలా చెప్పారనీ, జగన్ కి అంతా తెలిసే జరిగిందని, వివేకా హత్య కేసులో కర్త, కర్మ క్రియ అన్ని జగన్ రెడ్డి ముఠాయే చేసిందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.సీబీఐ విచారణ పిటిషన్ వేస్తానని సునీతమ్మ అంటే జగన్ ఎందుకు ఆపారనీ, మొదట సీబీఐ విచారణ కోరిన జగన్ రెడ్డి తరువాత వద్దు అనడం వెనుక కారణాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలనీ చింతమనేని డిమాండ్ చేశారు. సీఎం అయిన తరువాత జగన్ రెడ్డి సీబీఐ విచారణ పిటిషన్ ను ఎందుకు వెనక్కి తీసుకున్నారనీ, బాబాయిని చంపిన అబ్బాయిని జగన్ రెడ్డి రక్షించడం వెనుక అంతర్యం ఏమిటనీ చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు. వివేకా ఎలా చనిపోయారో జగన్ కి తెలుసు, మరి దాన్ని ఎందుకు దాచాలనుకుంటున్నారు? జగన్ రెడ్డి సీఎం కాగానే కేసు విచారణలో పురోగతి ఎందుకు ఆగిపోయింది? అని ప్రశ్నించారు. తన తండ్రికి న్యాయం చేయాలని కూతురు పోరాడుతుంటే తమ్ముడిని సీబీఐ అరెస్ట్ చేయకుండా జగన్ అడ్డుపడ్డారనీ, హై ప్రొఫైల్ కేసులో కూడా ఇంత జాప్యానికి జగన్ రెడ్డి కారణం అని సునీత చెప్పారనీ, నిజం బయటకు రాకుండా సీఎం జగన్ రెడ్డి ఆపుతున్నారనీ, కర్నూలులో అవినాష్ ను అరెస్టు చేయడానికి వస్తే ఉద్రిక్త వాతావరణం సృష్టించింది వైసీపీ నేతలే అని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. తన సోదరి వైఎస్ సునీత రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు జగస్ రెడ్డి అండ్ కో సమాధానం చెప్పాలనీ, జగన్ రెడ్డి ఇప్పటికైనా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి వివేకానందరెడ్డిని చంపిన నిజం ఒప్పుకోవాలనీ అన్నారు. ఇప్పటికైనా వైసీపీ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలనీ, ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు జగన్ కు కనీస అర్హత కూడా లేదనీ, ఆడబిడ్డకు న్యాయం చేయలేని సీఎం రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఏం న్యాయం చేస్తారనీ ఎద్దేవా చేశారు. విలువలు, విశ్వసనీయత, మాట తప్పను. మడమ తిప్పను లాంటి సోది డైలాగులు చెప్పడం ఇకనైనా వైసీపీ నాయకులు ఆపాలనీ, వివేకాను చంపిన వారిని వదిలిపెడితే మంచికి, చెడుకు అర్థం లేకుండా పోతుందనీ, పేదలు, పెత్తందార్లకు మధ్య యుద్ధం కాదు… హంతకులకు, రాష్ట్ర ప్రజలకు మధ్య ఇపుడు యుద్ధం అని చింతమనేని తెలిపారు.సునీత చేస్తున్న న్యాయపోరాటంలో ఆమెకు టీడీపీ అండగా ఉంటుందనీ, వివేకానంద రెడ్డిని క్రూరంగా గొడ్డలితో నరికి నరికి చంపిన నరహంతకులకు శిక్ష పడకపోతే రేపు పౌరుని మాన, ప్రాణాలకు కూడా రక్షణ ఉండదనీ, సునీత న్యాయపోరాటానికి 5 కోట్లమంది ప్రజలు పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలనీ చింతమనేని కోరారు.ప్రజల  ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండాలంటే కచ్చితంగా సునీతమ్మ చెప్పినట్లుగా జగన్ రెడ్డిని ప్రజలు ఓడించాలనీ చింతమనేని ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు.

About Author