PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ మూవీలో పొలిటీషియ‌న్

1 min read

ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేష‌న్ లో మ‌రో చిత్రం రాబోతోంది. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్దరి కాంబినేష‌న్ లో ఎన్టీఆర్ 30 వ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఈ సినిమా స‌మ‌కాలీన రాజ‌కీయాల బ్యాక్ డ్రాప్ లో రాబోతోంద‌ని స‌మాచారం. ఇందులో ప‌వ‌ర్ ఫుల్ రాజ‌కీయ‌నాయకురాలిగా.. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ న‌టించనున్నార‌ని టాలీవుడ్ టాక్. అయితే.. ఇటీవ‌ల క్రాక్, నాంది సినిమాల‌లో ప‌వ‌ర్ ఫుల్ పాత్రల‌తో … తెలుగు జ‌నాన్ని మెప్పించిన వ‌ర‌ల‌క్ష్మి… రాజకీయ నాయ‌కురాలిగా న‌టించబోతున్నార‌ని స‌మాచారం. మంచి పాత్రల‌తో టాలీవుడ్ లో దూసుకుపోతోంది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్. సినిమా ప‌ట్టాలెక్కే వ‌ర‌కు ఈ విష‌యం మీద క్లారిటీ రాద‌ని ప‌లువురు సిని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

About Author