పోలింగ్ బూత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ : మండలంలో గుడిపాడు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బోయవాళ్ళ పల్లి గ్రామంలో సుమారు 400 ఓటర్లు ఉన్నారని వీరందరూ గ్రామపంచాయతీకి ఓటింగ్ లో పాల్గొనడానికి గుడిపాడు కు వెళ్లే ఓటు వేయాలని ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక మండల తహసిల్దారు చంద్రశేఖర్ వర్మ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం బోయవాడ్లపల్లె గ్రామ ప్రజలు మాట్లాడుతూ శాసనసభ్యుల ఎన్నికలకు కూడా పిఆర్ పల్లి కి వెళ్లి ఓటేయాలని ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారుగా 11 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓటు వినియోగించుకోవాలని అదేవిధంగా వయోవృద్ధులకు, వికలాంగులకు గర్భిణులకు ఓటు వేయాలంటే కాలిబాట ద్వారానే వెళ్లాలని ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి వీరికి వారి గ్రామంలోనే ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ బూతులు ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ ప్యాపిలి మండలఅధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య, విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజు చిన్న సుంకన్న,నాగరాజు, రంగస్వామి, వెంకటప్ప, గ్రామ పెద్దలు, టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.