జిల్లాలో ప్రశాంతంగా, విజయవంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
1 min read– ఎన్నికల నిర్వహణకు సహకరించిన ఎన్నికల అధికారులకు, సిబ్బందికి, ఓటర్లకు కృతజ్ఞతలు
– జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, విజయవంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు పేర్కొన్నారు.ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించామన్నారు.. జిల్లాలో పట్టభద్రుల ఎన్నికలకు 74 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు 27 పోలింగ్ కేంద్రాలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆరు పోలింగ్ కేంద్రాలు, మొత్తం 107 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించామన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు..జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు.ఎన్నికల నిర్వహణ విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పనిచేశారని, ఇందు కోసం సహకరించిన ఎన్నికల అధికారులు, సిబ్బందికి, పటిష్టమైన బందోబస్తు నిర్వహించిన పోలీసు సిబ్బందికి, మండల, డివిజనల్, జిల్లా స్థాయి ఎన్నికల సిబ్బందికి, నోడల్ అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.