PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ వి యం లను సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేర్చాలి

1 min read

కలెక్టర్ సృజన ..చెక్ పోస్టు వద్ద పకడ్బందీగా వాహనాలు తనిఖీ చేయాలి

ఎస్పీ కృష్ణ కాంత్

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  ఎన్నికల సామగ్రి స్ట్రాంగ్ రూముల నుండి పోలింగ్ కేంద్రాల కు సరైన సమయానికి ఇబ్బందులు లేకుండా చేర్చాలని జిల్లా కలెక్టర్ సృజన, ఎన్నికల దృష్ట్యా కర్ణాటక సరిహద్దులో ఉన్న మాధవరం చెక్ పోస్టు వద్ద పకడ్బందీగా వాహనాలు తనిఖీ చేయాలని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ అధికారులను ఆదేశించారు. వీరు మంగళవారం మంత్రాలయం లో పరిమళ పాఠశాలలో ఎన్నికల సామగ్రి స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో స్ట్రాంగ్ రూముల నుండి ఎన్నికల సామగ్రి ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరైన సమయానికి చేర్చాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.  అంతర్ రాష్ట్ర సరిహద్దు మాధవరం చెక్ పోస్టు ను ఎస్పి కృష్ణ కాంత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ రవాణ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతివాహనం ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు.     చెక్ పోస్టులలో పకడ్బందీగా తనిఖీలు చేయాలన్నారు.ఎన్నికలు సమీపి స్తున్నందున  అంతర్ రాష్ట్ర సరిహద్దు లో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలన్నారు. డబ్బు, అక్రమ మద్యం రవాణా జరగకుండా కట్టడి చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న పోలీసులు అక్రమ రవాణా పై నిఘా ను పటిష్టం చేయాలని ఆదేశించారు. వీరి వెంట ఎమ్మిగనూరు డిఎస్పీ శ్రీ సీతారామయ్య, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస రెడ్డి,  మంత్రాలయం సిఐ ఎరిషావలి, కోసిగి సిఐ ప్రసాద్, మంత్రాలయం ఎస్సై గోపినాథ్, మాధవరం ఎస్సై  కృష్ణ మూర్తి,ఎస్బి ఎస్సై వేణుగోపాల్ రాజు, తహసీల్దార్ శ్రీ ధర్ మూర్తి, ఎన్నికల అధికారులు తదితరులు ఉన్నారు.

About Author