ఢిల్లీ కాలుష్యంపై సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
1 min read
పల్లెవెలుగు వెబ్: ఢిల్లీలో కాలుష్యం నానాటికి తీవ్రమౌతోంది. అది ఎంతలా అంటే ఇంట్లో కూడా మాస్కు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని కేంద్రానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా సీజే ఎన్వీ రమణ కీలక వాఖ్యలు చేశారు. ఇంట్లో ఉన్నా మాస్కు పెట్టుకోవాల్సిన గత్యంతరం ఏర్పడిందన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏమైనా లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో ఉన్నారా అని ఈ సందర్భంగా ప్రశ్నించింది సుప్రీం ధర్మాసనం.