పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య
1 min readకడుమూరులో విషాద ఘటన కన్నీటి సంద్రంలో కుటుంబ సభ్యులు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది.గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో కురువ రామ్మోహన్, జయలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం.కుమారుడు కురువ సాయి(18) కర్నూలులో ఓకాలేజీలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు.కూతురు వైష్ణవి (20)కి 15 రోజుల క్రితం గడివేముల మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.చెల్లి వైష్ణవి కి పెళ్లి చేయడం వలన అప్పు ఎక్కువగా అయినదని నీవు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తే అప్పు తీర్చుకోవచ్చు అంటూ అబ్బాయికి తండ్రి ప్రతిరోజూ చెబుతూ ఉండేవాడు.సోమవారం రాత్రి అందరితోపాటు అన్నం తిన్నాడని అందరూ క్రింద ఇంటిలో నిద్రిస్తూ ఉండగా జీవితంపై విరక్తి చెంది పై ఇంటిలో సాయి ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడని మంగళవారం ఉదయం 6 గంటలకు అబ్బాయి కిందికి రాలేదని తల్లిదండ్రులు ఇంటి పైకి వెళ్లి చూడగా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.అనంతరం మిడుతూరు పోలీసులు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను విచారించారని గ్రామస్తులు తెలియజేశారు.మరిన్ని పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.ఉన్న ఒక్క కుమారుడు చనిపోవడం పట్ల కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల శోధనలు మిన్నంటాయి.పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు.