హంద్రీనీవా ద్వారా చెరువులకు నీళ్లు నింపాలి…
1 min readఆర్డీవో కు వినతి పత్రం అందజేసిన అఖిలపక్ష పార్టీల నాయకులు.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా 106 చెరువులకు నీళ్లు నింపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల నాయకులతో కలిసి ఆర్డిఓ మోహన్ దాస్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, సిపిఎంంం మండల కార్యదర్శి దస్తగిరి, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపాల్, లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆనందాచారి లు మాట్లాడుతూ, హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా జలాలు కళ్ళ ఎదుట అనంతపూర్ జిల్లాకు తరలి పోతున్నా, పాలకుల వైఫల్యం కారణంగా పత్తికొండ ప్రాంత రైతుల పంట పొలాలకు సాగునీరు అందడం లేదని విమర్శించారు.పందికోన రిజర్వాయర్ కింద ఉన్న కుడి, ఎడమ కాలువ స్థిరీకరణ పనులు పూర్తిచేసి 61,400 ఎకరాల కు నీళ్లు పారించీ రైతులను ఆదుకోవాలన్నారు.ఎడమ ఎడమ కాలువ ద్వారాా పెద్దహుల్తి మీదుగా అటికల గుండు, నలక దొడ్డి, ఆస్పరి మండలం వెంగలాయి దొడ్డి వరకు ముందుకు పెంచాలని, తుగ్గలి మండలం రాంపల్లి దగ్గర, మద్దికేర మండలం బసినేపల్లి దగ్గర మినీ రిజర్వాయర్ లు నిర్మించాలని డిమాండ్ చేశారు. తుగ్గలి మద్దికేర మండలాలకు హంద్రీనీవా ప్రధాన జలాశయం తప్ప ఇలాంటి నీటి వనరులు లేని మండలాలని తుగ్గలి మండలంలో రాంపల్లి దగ్గర మద్దికేర మండలం బసినేపల్లి దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు వేలాది ఎకరాలు సాగునీరుతోపాటు గ్రామాల్లో తాగునీరు పరోక్షంగా భూగర్భ జలాలు పెరిగి రైతులకు బోరు మోటర్ ద్వారా నీళ్లు అందుబాటులోకి వస్తాయని ఎడమ కాలు పొడిగించడం ద్వారా పెద్దహుల్తి మీద దేవనబండ అటికలు గుండు నలగదొడ్డి గ్రామాల మీద ఆస్పర మండలం వెంగల దొడ్డి వరకు పొడిగిస్తే దాదాపు పదివేల ఎకరాలు నాలుగు చెరువులు నీటితో నింపచ్చని పత్తికొండ మండలం హోసూర్ దగ్గర ప్రత్యేక తూము ఏర్పాటు చేయడం ద్వారా నల్ల రాగిడి భూములలో వందలాది ఎకరాలు సాగులోకి వస్తాయని హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా వచ్చే నీటిని పత్తికొండ తుగ్గలి మద్దికేర మండలాలకు నీటిని కట్టించకపోతే రానున్న రోజుల్లో ఎడారిగా మారే ప్రమాదం ఉందని వారన్నారు గత9 సంవత్సరాల నుండి హంద్రీనీవా ప్రధాన కాలువ నుండి 106 చెరువులకు నీళ్లు నింపుతామని పాలక ప్రభుత్వాలు వట్టి మాటలు మాత్రమే చెబుతూ, ఇంతవరకు ఏ ఒక్క చెరువుకు నీళ్లు నింపింది లేదన్నారు. చెరువులకు నీళ్లు నింపేంతవరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి దశల వారి గా మరిన్ని ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్, తెలుగుదేశం పార్టీ నాయకులు అశోక్ కుమార్, గుడిసె నరసింహులు, సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, సిపిఎం నాయకులు దస్తగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగార్జున, జనసేన నాయకులు వీరేష్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు గురుదాస్, సురేంద్ర కుమార్, తిమ్మయ్య, కారన్న, ప్రజా సంఘాల నాయకులు నెట్టికంటయ్య, రంగన్న, జొహరాపురం కాశి, పెద్దయ్య, లోక్ సత్తా నాయకులు జయరాం, సిపిఎం నాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.