పూలే జీవితం… ఆదర్శం
1 min read–కర్నూలు ఇన్చార్జ్ కలెక్టర్ రాం సుందర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబా పూలే జీవితం.. ప్రతిఒక్కరికీ ఆదర్శమన్నారు జేసీ(డి), జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ రాం సుందర్ రెడ్డి. ఆదివారం పూలే 195 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని బిర్లా గెట్ సర్కిల్ నందు మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు తినిపించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల కోసం తన జీవితమంతా అంకితం చేసి సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని, ఆ మహనీయుడు ఆశయాలను మనమందరం ముందుకు తీసుకెళ్లి సమాన సమాజం నిర్మిద్దాం అన్నారు. కార్యక్రమంలో కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డీ.కే.బాలాజీ, డిఆర్ఓ పుల్లయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ శిరీష, సమాచార శాఖ డిడి పి.తిమ్మప్ప, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఇంచార్జి ఆఫీసర్ అనురాధ, కార్పొరేటర్ వై.సత్యనారాయణమ్మ, డివిఎంసి మెంబెర్ లు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. సోమసుందరం, రాష్ట్ర నాయకులు లక్ష్మీ నరసింహ యాదవ్, శేష పణి, బాల సంజన, బేతం కృష్ణుడు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎ.నాగేశ్వరి, రాయలసీమ దండోరా నాయకులు అనంత రత్నం, నాయి బ్రాహ్మణ సంఘం రమణమూర్తి, వడ్డెర సంఘం లక్ష్మీకాంతం, బీసీ విద్యార్థి సంఘం మోహన్, కే. రామకృష్ణ, నాగరాజు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.