PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు పూలే

1 min read

.. ప్రభుత్వ సలహాదారు డి.యస్. హబీబుల్లా ..

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహానీయులు, సామాజిక ఉద్యమకారులు, మార్గదర్శి శ్రీ జ్యోతిరావు పూలే  వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు డిఎస్ హబీబుల్లా మంగళవారం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడి, వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author