ప్రపంచ శాంతిని కాంక్షించే పోప్ ఫ్రాన్సిస్ మరణం తీరని లోటు
1 min read
క్రీస్తు చూపిన సన్మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ,ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజల శాంతిని కాంక్షించారు
ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రపంచ శాంతిని కాంక్షించే పోప్ ఫ్రాన్సిస్ మరణం తీరని లోటని, ఆయన పట్ల ఏలూరు రోమన్ కాథలిక్ పీఠం ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావ్ పొలిమేర తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్రీస్తు చూపిన సన్మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ, ప్రపంచంలోని అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజల సుఖ శాంతులను కాంక్షిస్తూ ప్రజలకు సేవలు అందించిన మహా వ్యక్తి గా పోప్ ఫ్రాన్సిస్ ని కొనియాడారు. ఈరోజు ఉదయం పోప్ ఫ్రాన్సిస్ మరణ వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని ఏలూరు బిషప్ జయరావ్ పొలిమేర తెలిపారు. అట్టడుగు స్థాయిలో ఉన్న పేద ప్రజలకు సేవలు అందించటం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులను, గురువులను, మఠ కన్యలను ఎంతగానో దీవిస్తూ, వారి బాధ్యతల పట్ల ప్రేరేపిస్తూ పవిత్ర పోప్ ఫ్రానిన్స్ లేఖలు రాసే వారని, 2013లో తనను ఏలూరు పీఠాధిపతిగా అధికారికంగా ప్రకటించింది. పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ అని గుర్తు చేసుకున్నారు, ఈ 12 సంవత్సరాల కాలంలో వారిని ఎన్నో సార్లు కలవటం జరిగింద అని, వారి ఆప్యాయమైన పలకరింపు, వారి స్వచ్ఛమైన మనసు, పేద వర్గాల పట్ల వారికి ఉన్న ప్రేమ కరుణను ఎన్నటికీ మరచిపోలేము అని, ఏలూరు బిషప్ జయరావ్ పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ తో తనకు ఉన్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ ఏలూరు కతోలిక పీఠం తరపున ప్రజలంతా పోప్ ఫ్రాన్సిస్ ఆత్మశాంతికి ప్రార్థించాలని బిషప్ జయరావ్ కోరారు.
