ప్రింటింగ్‌ను నిలిపేస్తున్న ప్రముఖ పత్రిక..
1 min readడిజిటల్ ఎడిషన్ లకే పరిమితం…!
అమరావతి: తెలుగు పత్రికా రంగంలో ఓ సంస్థ కొన్నేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. అయితే కరోనా వైరస్ అన్ని రంగాలతో పాటు పత్రికా రంగాన్ని కూడా అతలాకుతలం చేసేసింది. దీనికి ఏ పత్రికా రంగం మినహాయింపు కాదనే చెప్పవచ్చు. దీంతో పాటు మీడియాలో మారుతున్న పోకడల కారణంగా ఆ సంస్థ యాజమాన్యం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పత్రికా ప్రింట్‌ను త్వరలోనే క్లోజ్ చేస్తారని ఆ సంస్థ ఉద్యోగులు బహిరంగంగానే చెప్తున్నారు. భవిష్యత్‌లో కేవలం ఆన్లైన్ ఎడిషన్‌కే పరిమితం అవుతుందని వారి మాటల సారాంశం. ఇప్పటికే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ధాటికి మెయిన్ స్ట్రీమ్ మీడియా విలవిలలాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.