NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగన్​ వెంట.. నడిచిన వారందరికీ పదవులు ఇవ్వలేం..

1 min read

– వైసీపీ పట్టణాధ్యక్షుడు అంజాద్​ ఆలీ
పల్లెవెలుగు వెబ్​, ఆత్మకూరు: జగన్ వెంబడి పాదయాత్రలో లక్షల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తిరిగారని వారందరికీ పదవులు ఇవ్వడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు వైసీపీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ. ఆదివారం పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జెడ్ పి టి సి, ఎంపీపీ , పట్టణాధ్యక్షుడు అంజద్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వెంకటాపురం ఎంపీటీసీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. శిల్పచక్రపాణి రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ప్రజలకు సేవ చేశారని, పట్టణంలో నీటి సమస్య ఉందని తెలుసుకుని తన సొంత డబ్బులను ఖర్చు చేసి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారని గుర్తు చేశారు. ఎంతో మంది నాయకులకు కాంట్రాక్ట్ పనులు ఇచ్చి ఒక్క పైసా ఆశించకుండా పనులు కేటాయిస్తున్నారన్నారు. మండలంలో ఒక ఎస్సీ మహిళలు మండల అధ్యక్షుడు పదవి ఇస్తే ఓర్చుకోలేని కుందూరు శివారెడ్డి పార్టీకి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదని పట్టణాధ్యక్షుడు అంజద్ అలీ హెచ్చరించారు.

About Author