NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేర‌ళ‌లో ద‌డ‌..వ్యాక్సిన్ తీసుకున్నాక ‘పాజిటివ్’

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కేర‌ళ‌లో క‌రోన క‌ల‌క‌లం సృష్టిస్తోంది. కోవిడ్ రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో 40 వేల మందికి పైగా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వ‌ర్గాలు ఇంగ్లీష్ మీడియాకు వెల్లడించాయి. ఇలాంటి కేసులు దేశ‌వ్యాప్తంగా ల‌క్ష న‌మోదు కాగా.. వాటిలో 40 వేలు ఒక్క కేర‌ళ‌లోనే న‌మోదు కావ‌డం వైర‌స్ ఉధృతికి అద్దంబ‌డుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్రమ‌త్తమైంది. 40 వేల మంది శాంపిళ్లు సేక‌రించి జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నివేదిక వ‌చ్చిన త‌ర్వాతే కేర‌ళ‌లో క‌రోన వ్యాప్తికి కార‌ణ‌మైన వేరియంట్ ఏది ? అన్న విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తుంది.

About Author