దర్జాగా వికలాంగుల భూములు కబ్జా
1 min read– తమకు న్యాయం చేయాలని వికలాంగులు లక్కిరెడ్డిపల్లెలో రోడ్డుపై బైఠాయించి నిరసన
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం పరిధిలోని లక్కిరెడ్డిపల్లిలో వికలాంగుల భూములను దర్జాగా కబ్జా చేసినట్లు వికలాంగులు లబోదిబోమంటున్నారు.వైసిపి నాయకుల ఒత్తిళ్ళ తోసంవత్సరాల తరబడి రెవెన్యూ అధికారులు కళ్లు అరిగేలా కార్యాలయాలు చుట్టూ తిట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కలెక్టర్ గారు మాకు న్యాయం చేసి వికలాంగుల భూములు కాపాడాలని వివాదాలు చూశారు.అన్నమయ్య జిల్లారాయచోటి నియోజకవర్గం లోని లక్కిరెడ్డిపల్లి మండలంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో 502/1,502/3 సర్వే నెంబర్లలో సుమారు మూడు ఎకరాల భూమిదశాబ్దాల తరబడి వారసత్వంగా ఉన్న వికలాంగుల భూములల్లో ఆన్లైన్లో ప్రత్యక్షమైన ఇతరుల షేర్లు.గత ఏడు సంవత్సరాలుగా వికలాంగులు కాళ్లు అరిగేలా రెవిన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న సమస్యను పరిష్కరించని రెవిన్యూ అధికారులుఇందులో భాగంగా విసిగిపోయిన వికలాంగులు మంగళవారం రోజులక్కిరెడ్డిపల్లి పల్లెలోరాయచోటి వేంపల్లి ప్రధాన కూడలి రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం జరిగే వరకూ కలెక్టర్ రావాలి మాకు న్యాయం జరగాలంటూ నినాదాలు చేసి రోడ్డుపై బైఠాయించారు. సంబంధిత ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి వికలాంగులకు రికార్డుల ప్రకారము న్యాయం చేయాలని కోరారు.