PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీసీల డిక్లరేషన్… బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యం.. టిడిపి తోనే సాధ్యం..

1 min read

రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ కార్యదర్శి.. లాయర్ బాబు..

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  పాణ్యం  మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి జనసేన పార్టీలు మంగళగిరి సభలో సంయుక్తంగా విడుదల చేసిన బిసి డిక్లరేషన్  గురించి టిడిపి బీసీ నాయకులు గురువారం నాడు విలేకరుల సమావేశం  ఏర్పాటు చేశారు  టిడిపి బిసి నాయకులు   మాట్లాడుతూ ఆనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ లేని రిజర్వేషన్లను,మన రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో  రిజర్వేషన్లను తీసుకువచ్చి బీసీలకు చట్ట సభల్లో రాజ్యాంగా అధికారం కల్పించారని నందమూరి తారకరామారావు మరియు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా  ఉన్నప్పుడు వారి క్యాబినెట్లో బీసీలకు పెద్దపీట వేశారన్నారు బీసీలలో కులవృత్తి వారికి  ఆదరణ పథకాలు ప్రవేశపెట్టి పూర్తి సబ్సిడీతో కుల వృత్తి పనిముట్లు  ఇవ్వడం జరిగింది అన్నారు  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ కు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆదరణ లభిస్తుందన్నారు.స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతం తగ్గించి మొన్నటి స్థానిక సంస్థ ఎన్నికల్లో 16, 800 పదవులు రాకుండా వైకాపా ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో  24 శాతం ఉన్న రిజర్వేషన్లు 34 శాతం వరకు పెంచుతామని బీసీ డిక్లరేషన్ లో ప్రకటన చేశారు.బిసి వారికి 50 సంవత్సరాల వయస్సు వారికి  4 వేల పెన్షన్ పథకాన్ని ప్రకటించారు.  పేద బీసీ మహిళలకు పెళ్లి కానుకగా లక్ష రూపాయలు ప్రకటించారన్నారు చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు అలాగే బీసీ రక్షణ చట్టం తీసుకువచ్చి బీసీలకు న్యాయం చేస్తామన్నారు బీసీ డిక్లరేషన్ ప్రకటించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీలు తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలను గెలిపిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు  పాణ్యం నియోజవర్గ టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు కృష్ణ యాదవ్ పాణ్యం మండల బీసీ సెల్ అధ్యక్షులు రవికుమార్ రాష్ట్ర వాల్మీకి బోయ సాధికార సమితి సభ్యులు గుజ్జుల ఎల్ల సుబ్బయ్య నంద్యాల జిల్లా బెస్త  సాధికార సమితి సభ్యులు సుధాకర్ పాణ్యం  నియోజకవర్గ వాల్మీకి బోయ సాధికార నాయకులు శేఖర్ నాయుడు శ్రీనివాస్ యాదవ్ ఎర్రమల మదిలేటి రవి ఎల్లనాయుడు బీసీ నాయకులు పాల్గొన్నారు.

About Author