NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాంగ్రేస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

1 min read

కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రజల ఆశీర్వదించాలి

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జాతీయ పార్టీ కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రానున్న సార్వత్రిక  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రజల ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మిద్దెల నాగలింగం పేర్కొన్నారు. మంగళవారం ఆయన  విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, సామాన్య మధ్య తరగతి ప్రజలు జగన్ ను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని , ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి రూ.5వేలు నెలకు అందజేస్తారని, అంతే కాకుండా రూ.3 లక్షలు రుణమాఫీ ఇస్తారని మాట ఇస్తే తప్పకుండా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల ఫోటోతో ఉన్న ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ అభయం రూ.5 వేలు ఇస్తామని హామీ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా సెక్రటరీ లు రవి, సురేష్ , రమేష్ బాబు, సెక్రటరీ జి సుంకన్న గౌడ్, మీడియా ఇంచార్జ్ లక్మన్న, కార్యకర్తలు శివ, అయ్యన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author