NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్: ఇండియా పోస్ట్ మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 188 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు. టెన్త్, ఇంటర్ పాస్ కావడంతో పాటు ఆయా క్రీడల్లో రాణించిన క్రీడాకారులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

అప్లై చేయడానికి 2022 నవంబర్ 22 చివరి తేదీ.

దరఖాస్తు ప్రారంభం- 2022 అక్టోబర్ 23

ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్- 2022 నవంబర్ 22 సాయంత్రం 6 గంటల వరకు

ఎంపికైన అభ్యర్థులతో ప్రొవిజినల్ లిస్ట్ ప్రకటన- 2022 డిసెంబర్ 6 విద్యార్హతలు- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 10వ తరగతి పాస్ కావాలి. 2022 అక్టోబర్ 25 నాటికి ఈ విద్యార్హతలు ఉండాలి.

వయస్సు- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం- విద్యార్హతలతో పాటు క్రీడార్హతలు ఉండాలి. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతనం- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,100 వేతనం, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 వేతనం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18,000 బేసిక్ వేతనంతో మొత్తం 56,900 వేతనం లభిస్తుంది. అలవెన్సెస్ కూడా ఉంటాయి.

వెబ్ సైట్ : https://dopsportsrecruitment.in/

About Author