సామాన్యులకు అందుబాటులో పోస్ట్ ఆఫీస్ సేవలు
1 min read– భారీగా పెరిగిన పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లు
పల్లెవెలుగు వెబ్ వనపర్తి: దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో సైతం పోస్టల్ శాఖ సేవలు తమ సేవలను అందిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు ముఖ్యంగా వనపర్తి డివిజన్ లో1 హెడ్ పోస్ట్ ఆఫీస్, 8సబ్ ఆఫీసులో ,92 బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ల ద్వారా గ్రామాల్లోని ప్రతి వ్యక్తికి పోస్ట్ ఆఫీస్ ల ద్వారా సేవలు అందుతున్నాయి. ఇదే కాకుండా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల ప్రారంభం, ఏఈపిఎస్ ల ద్వారా చెల్లింపులు అప్రతిహతంగా కొనసాగుతూ ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లో అనేక ప్రజాకర్షక పథకాలు గ్రామీణ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి పి.ఎల్.ఐ ,ఆర్పిఎల్ఐ ఇన్సూరెన్స్ పథకాలు ఈ పథకాల కింద తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ తో వచ్చేటట్లుగా నాలుగు ప్రధాన పాలసీలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం కింద 0 నుండి 10 సంవత్సరాలలోపు బాలికలకు సుకన్య సమృద్ధి యోజన ద్వారా మినిమం 250 రూపాయలతో ఖాతా ప్రారంభించవచ్చు బాలికలకు ఈ ఖాతాలో అత్యధిక వడ్డీ ఈ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది.ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా చెల్లింపులు ఐపిపిబి ద్వారా ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ద్వారా ఏ బ్యాంకు నుండి అయినా ఖాతాదారులు తమ సేవింగ్స్ బ్యాంకు నుండి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చును దీనిలో డోర్స్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ కూడా కలదు. అంతేకాకుండా వివిధ రకాల పథకాలను కూడా పోస్ట్ ఆఫీస్ తమ సేవలను అందిస్తుంది ఆ పథకాలకు సంబంధించి వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. సేవింగ్స్ అకౌంట్ కి నాలుగు శాతం ,రికరింగ్ డిపాజిట్ గా 5.8% ,ఒక సంవత్సరం టైం డిపాజిట్ కు 6.6%, రెండు సంవత్సరాలకు ₹6.8% ,మూడు సంవత్సరాలకు 6.9 శాతం, ఐదు సంవత్సరములకు ఏడు శాతం ,మంత్లీ ఇన్కమ్ స్కీం లో 7.1% నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ లో ఏడు శాతం, కిసాన్ వికాస పత్రంలో 7.2%, సీనియర్ సిటిజన్ ఖాతాకు 8 శాతం ,సుకన్య సమృద్ధి అకౌంట్ 7.6% ,పిపీఎఫ్ ఖాతా కు 7.1%, వడ్డీరేట్ల లను ప్రజలకు అందిస్తుంది కావున గ్రామీణ పట్టణ ప్రజలు సదవకాశాన్ని ఎక్కువ సంఖ్యలో వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సబ్ డివిజనల్ అధికారి అబిన్ శర్మ, వనపర్తి డివిజనల్ హెడ్ వెంకటేశ్వర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అబిన్ శర్మ :సబ్ డివిజన్ హెడ్: వనపర్తి సబ్ డివిజన్
గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉన్న పోస్ట్ ఆఫీస్ సేవలను ప్రజలు మరింతగా ఉపయోగించుకొని తమ ఆర్థిక అవసరాలను సాధించుకోవాలని సబ్ డివిజన్ అధికారి అభినన్ శర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.