PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మా’ ఎన్నికల్లో పోస్టల్​ బ్యాలెట్​ కుట్ర జరుగుతోంది! ప్రకాశ్​రాజ్​

1 min read

పల్లెవెలుగువెబ్​, హైదరాబాద్​: తెలుగుచలన చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ ఎన్నికలు ఈనెల 10న జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల విషయంలో పోస్టల్​బ్యాలెట్​ కుట్ర జరుగుతుందని ఓ ప్యానల్​కు అధ్యతపదవీ బరిలో ఉన్న ప్రకాశ్​రాజ్​ మంగళవారం ఆరోపించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. విష్ణు ప్యానల్​ 60ఏళ్లు పైబడిన సీనియర్​ నటీనటుల నుంచి పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా అక్రమ మార్గంలో ఓట్లు దండుకునే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కృష్ణంరాజు, శరత్​బాబు, శారద, పరుచూరిబ్రదర్స్ వంటి సంబంధించిన పోస్టల్​ బ్యాలెట్​ సొమ్మును ఓ అగంత వ్యక్తి ద్వారా చెల్లించిందని ఆరోపించారు. కుట్రలతో బెదిరిస్తున్నారా…అంటూ ప్రశ్నించారు. ఎవరికీ తెలియని అగంతక వ్యక్తులతో మూవీ ఎన్నికలు నిర్వహిస్తారా..?, ఇలా గెలవాలనుకునే వారిపై చిత్రపరిశ్రమ క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూవీ ఆర్టిర్స్​ అసోసియేషన్​ ఎన్నికలు కొన్నేళ్లుగా వివాదాల మధ్యే జరుగుతున్నాయని ప్రకాశ్​రాజ్​ ఆవేదన వ్యక్తం చేశారు.

About Author