NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిద్ధం మహాసభను జయప్రదం చేయాలని గోడపత్రికలు విడుదల                       

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  ఈనెల 18న అనంతపురంలో జరిగే వైసిపి సిద్ధం మహాసభకు పత్తికొండ నియోజకవర్గం నుండి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి  సభను జయప్రదం చేయాలని వైఎస్ఆర్సిపి ఎస్ రామచంద్ర రెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్ నాగరత్నమ్మ కోరారు. ఈ మేరకు బుధవారం వారి స్వగృహంలో నిర్వహించిన  విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిందని అన్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో తిరిగి అధికారం చేపట్టబోతుందని తెలిపారు. జగన్ ప్రభుత్వం పై ప్రజలకు ఉన్న నమ్మకం తిరిగి అధికారంలోకి తీసుకు రాగలరని స్పష్టం చేశారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సిద్ధం మహాసభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీన అనంతపురంలో వైఎస్ఆర్సిపి తలపెట్టిన సిద్ధం మహాసభకు పత్తికొండ నియోజకవర్గo నుండి భారీగా తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిద్ధం మహాసభకు సంబంధించిన గోడపత్రికలను వారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి యూత్ లీడర్లు శ్రీకాంత్ రెడ్డి, మధు, వైసీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, లింగన్న, పందికోన మల్లికార్జున,పులికొండశ్రీరంగడు,రామాంజనేయులు, నెట్టేకల్లు,సుంకన్న, పాల భాష తదితరులు పాల్గొన్నారు.   

About Author