NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ వాయిదా వేయండి : నిర్మలాసీతారామ‌న్

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరిక‌ల్ రిక్రూట్మెంట్ వాయిదా వేయాల‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల‌సీతారామ‌న్ ఆదేశించారు. క్లరిక‌ల్ ప‌రీక్షల‌ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించ‌డంపై వేసిన క‌మిటీ నివేదిక 15 రోజుల్లో రానున్న నేప‌థ్యంలో .. అప్పటి వ‌రకు ప‌రీక్షల నిర్వహ‌ణ వాయిదా వేయాల‌ని ఐబీపీఎస్ కు ఆమె సూచించింది. ప‌లు బ్యాంకుల్లో క్లరిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఎప్పటిలాగే ప‌రీక్షలు హిందీ, ఇంగ్లీషు మీడియంలో నిర్వహిస్తామ‌ని పేర్కొంది. క్లరిక‌ల్ ప‌రీక్షల‌ను కూడ ప్రాంతీయ భాష‌ల్లో నిర్వహించాల‌ని నిర్ణయించిన నేప‌థ్యంలో .. ప‌రీక్షలు వాయిదా వేయాల‌ని నిర్మాల‌సీతార‌మ‌న్ ఆదేశించారు. ఐబీపీఎస్ ప‌రీక్షలు హిందీ, ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాష‌ల్లో నిర్వహించ‌బోతున్నారు.

About Author