PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుంతల రోడ్లు… ప్రజలను రక్షించండి

1 min read

– భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు )సి.పి.ఎం పార్టీగా

పల్లెవెలుగు, వెబ్​ నంద్యాల: నేడు స్థానిక నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం నందు ఆర్ అండ్ బి ఆఫీస్ ముందు ధర్నా చేసి R&B E. Eసురేష్ కుమార్ గారికి వినతిపత్రం అందించారు, ఈ సందర్భంగా సి.పి.ఎం పార్టీ పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు, కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ లింగం గారు మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో గుంతలు పడ్డ రోడ్లను బాగు చేయాలని సిపిఎం పార్టీగా నూన పల్లె ఓవర్ బ్రిడ్జి నందు ప్రజలతో సంతక సేకరణ చేసి E.Eసురేష్ కుమార్ గారికి అందించడం జరిగింది అన్నారు, ఈ సంతక సేకరణలో భాగంగా ప్రజలందరూ సిపిఎం పార్టీకి ధన్యవాదాలు చెప్పారు, ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ఫ్లైఓవర్ బ్రిడ్జి అలాగే రైతు నగరం రోడ్డు మీదుగా 100 గ్రామాల ప్రజలు వేలమంది నంద్యాల పట్టణంలోకి గ్రామాల నుంచి వస్తారు ఈ సందర్భంగా చాలామంది ఈ గుంతలు పడ్డ రోడ్ల వలన కింద పడ్డారు ,దెబ్బలు తగిలించుకొని యాక్సిడెంట్లు చేసుకొని హాస్పిటల్లో పాలైనారు, ఇదే రోడ్డుమీద కలెక్టర్ తిరుగుతున్నాడు ,ఎం.పీ పోచ బ్రహ్మానంద రెడ్డి రోజు ఇదే రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు అయినా కూడా వారు పట్టించుకోవడం లేదు, అందుకే సిపిఎం పార్టీగా ప్రజాభిప్రాయ సంతక సేకరణ చేసి ఆర్ అండ్ బి అధికారులకు అందించడం జరిగింది. అయితే ఆర్ అండ్ బి అధికారులు ఈ రోడ్డు తమ పరిధిలోకి రాదని నేషనల్ హైవే పరిధిలోకి వస్తాదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు, నేషనల్ హైవే ఆఫీసు ఇక్కడ లేదని కర్నూల్ లో ఉందని అక్కడ ఈ కంప్లైంట్ ఇవ్వాలని అధికారులు సూచించగా సిపిఎం పార్టీ నాయకులు ఆర్ అండ్ బి ఈ తో మాట్లాడి తపాల ద్వారా ఈ యొక్క ప్రజల సంతకాల సేకరణను అక్కడికి పంపించడం జరిగిందని అన్నారు, అలాగే పద్మావతి నగర్ లో రోడ్డు గుంతలు పడ్డాయి ఈ యొక్క రోడ్డు నందు కూడా వేలాది మంది ప్రజలు హాస్పటలకు, హోటల్స్ కు, షాపింగ్ మాల్స్ లకు తిరుగుతుంటారు , ఈ పద్మావతి నగర్ ఏరియా చాలా విలువైన ఏరియా, నంద్యాల మున్సిపాలిటీకి ఎక్కువ శాతం పన్నులు కట్టే ఏరియా ఇది, ఇటువంటి ఏరియాలో కూడా గుంతలు పడితే పట్టించుకోవడం లేదంటే చాలా బాధాకరమైన వారన్నారు, నందమూరి నగర్ రోడ్డు కూడా కొన్ని సంవత్సరాల నుంచి గుంతలమయమైన పట్టించుకోవడంలేదని వారు అన్నారు, కాబట్టి తక్షణమే అధికారులు ఈ యొక్క రోడ్లు బాగు చేయాలని వారు డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో నాయకులు శివ,లక్ష్మణ్, సాయి, మునాఫ్ సుబ్బయ్య ,సుధాకర్ ,రమణ తదితరులు పాల్గొన్నారు.

About Author