NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రహదారిపై గుంతలు… పూడ్చిన సర్పంచ్

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు: స్థానిక మిడుతూరు మండల కేంద్రమైన మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లే దారి గత చాలా రోజుల నుండి వర్షాలకు రోడ్డు గుంతలుగా ఉండడం వర్షపు నీరు నిల్వ ఉండటం వలన అధికారులు ఇటు మండల ప్రజలు విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.ఈరహదారి వైపునే మండల ప్రధాన కార్యాలయాలు పాఠశాలలు ఎంపీడీఓ కార్యాలయం,సామాజిక ఆరోగ్య కేంద్రం,మోడల్ పాఠశాల,కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల,ఎస్సీ బాలుర వసతిగృహం ఉన్నాయి.చినుకు పడితే చాలు రోడ్డు గుంతలుగా వర్షపు నీరు నిల్వ ఉండటం వలన ప్రజలు, విద్యార్థులు బురద నీటిలోనే వెళ్లాల్సిందే. వీటిని గమనించిన గ్రామ సర్పంచ్ విద్యాపోగుల జయలక్ష్మమ్మ ట్రాక్టర్లతో గుంతలుగా ఉన్న చోట గ్రావెల్ ను వేయించి పోక్లేయిన్ ద్వారా చదును చేయించారు. జరుగుతున్న పనిని ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,ఈఓఆర్డి ఫక్రుద్దీన్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి,పంచాయతీ కార్యదర్శి సుధీర్ నందకుమార్,బక్కన్న పాల్గొన్నారు.

About Author