పోతుల నాగరాజును కత్తి నరసింహ రెడ్డిని గెలిపించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నిస్వార్థ సేవకుడు పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి పకీర్ సాహెబ్ పిలుపునిచ్చారు. పోతుల నాగరాజును గెలిపించాలని శనివారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మల్యాల గ్రామంలో స్కూల్స్ ,సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, పట్టభద్రుల ను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలని కోరారు . అభ్యర్థుల గురించి వివరిస్తూ దేశానికి ,రాష్ట్రానికి పాలిస్తున్న పాలక పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రజా, కార్మిక, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా పక్కదారి పట్టిస్తున్నారు. అన్ని రకాల నిత్యవసర ధరలు పెరిగి ప్రజల పైన భారాలు పెరుగుతుంటే వాటిపై మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. నిరంతరం ప్రజా ,ఉద్యోగ, కార్మికుల కోసం ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదులుకొని ప్రజా ఉద్యోగ కార్మిక గొంతుకగా మారి వారి సమస్యలను నిరంతరం శాసనమండలిలో వినిపించడానికి సిద్ధపడిన నిస్వార్ధపరుడు పోతుల నాగరాజు అని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. పిడిఎఫ్ అభ్యర్థులను పోతుల నాగరాజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ నందికొట్కూర్ మున్సిపాలిటీ పట్టణంలో సిఎస్ఐ పాలెం ఏబీఎం పాలెం అల్లూరు రోడ్డు చాకలిపేటలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు యువజన. ఎస్ఎఫ్ఐ మాజీ నాయకుడు ఎరుకలి రాజు, షాకీర్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన శాసనమండలిలో ప్రశ్నించే వారిని ఎన్నుకోవాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. నిరంతరం విద్యా వైద్యం నిరుద్యోగ ఉపాధి హక్కుల కోసం పోరాడే వారిని చట్టసభలకు ఎన్నో కోవాలని అన్నారు పశ్చిమ రాయలసీమ ప్రాంతంలో నీరు ప్రాజెక్టులు ఇరిగేషన్ సమస్యల పైన ఈ ప్రాంత వాసులుగా ముందుండి ప్రభుత్వాలను నిలదీస్తారని అటువంటి వారికి ఓటు వేసి వేయించి గెలిపించాలని పోతుల నాగరాజు బ్యాలెట్ నెంబర్ 27 ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి సామన్న, ఎస్ మౌ లాలి అశోక్ మధుసూదన్ గౌడ్, ఉదయ్ కిరణ్.వలి శ్రీను , వ్యాకాస మండల ఉపాధ్యక్షులు వేణుగోపాల్ ,పట్టభద్రులు వెంకటేష్ ,శ్రీరాములు గౌడ్, మధు , తదితర పట్టభద్రులు పాల్గొన్నారు.