చెన్నూరులో కుండ పోత వర్షం.. పంట నీటి పాలు
1 min read– దెబ్బతిన్న వరి పంటను పరిశీలించిన ఆర్డీవో. పి ధర్మచంద్రారెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : అల్పపీడన ధోరణి కారణంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు చెన్నూరు మండలంలో భారీ వర్షం కురిసింది. కుండ పోత వర్షం కురవడంతో రైతులు సాగుచేసిన వరితోపాటు ఇతర పంటలు కూడా దెబ్బ తిన్నాయి. చెన్నూరు మండల వ్యాప్తంగా87.2. మిల్లీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదయింది. పలు రోడ్లు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. చెన్నూరు శివాల పల్లి వివిధ గ్రామాల్లో చేతికొచ్చిన వరి పంట పూర్తిగా దెబ్బతింది. చెన్నూరు మండలంలో దెబ్బతిన్న వరి పంటను కడప ఆర్డీవో పి ధర్మచంద్రారెడ్డి సోమవారం చెన్నూరు శివాలపల్లి గ్రామాల్లో వరి పంటను పరిశీలించారు. పంటలను పరిశీలించిన వారిలో మండల తాసిల్దార్ మహమ్మద్ అలీ ఖాన్ మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి. వ్యవసాయ సిబ్బంది సుజన వీఆర్వోలు రసూల్ శ్రీకాంత్ రెవిన్యూ సిబ్బంది వ్యవసాయ సిబ్బంది పరిశీలించిన వారిలో ఉన్నారు.25 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా తయారు చేశారు.