పెదవేగి మండలం కవ్వగుంట సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ కు అంతరాయం
1 min read
3గంటల నుండి 6 గంటల వరకు విద్యుత్ నిలుపుదల
స్థానిక ప్రజలు సహకరించాలని మనవి
కె.ఎం అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పెదవేగి మండలం, పెదవేగి సెక్షన్ పరిధిలో ఉన్న 33/11 KV కవ్వగుంట సబ్ స్టేషన్ లో మరమత్తులు నిమిత్తం కారణముగా ఈనెల 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 03:00 గంటల నుండి సాయంత్రం 06:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయబడునని తూరుపుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.ఎం.అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికరణంగా కవ్వగుంట సబ్ స్టేషన్ పరిసర ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడును, కావున వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా అంబేద్కర్ కోరారు.