7వ తేదీ పవర్ పేట ఫీడర్ పరిధిలో విద్యుత్తుకు అంతరాయం
1 min read
ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల
వినియోగదారులు సహకరించలని మనవి
కె.ఎం అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,ఆపరేషన్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థఏలూరు జిల్లా,ఏలూరుమండలం,11 కేవి పవర్ పేట ఫీడర్ కు చెట్లు కొమ్మలు నరుకుట(ట్రీ కటింగ్) మరియు లైన్లకు మరమ్మతు చేయుటకు గాను 06.07.2025 (ఆదివారం) ఉదయం 8.00AM గంటల నుండి 01.00PM గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయబడును. అందువల్ల పవర్ పేట ఫీడర్ పరిధిలోని పవర్ పేట,చిట్టివలస పాకలు, వసంత మహల్, కర్రల వంతెన ,పాత బస్టాండ్, గూడ్స్ షెడ్ రోడ్డు, పాండురంగ పురం మరియు పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా కెఎం అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,ఆపరేషన్ ఒక ప్రకటనలో తెలిపారు.
