శుక్రవారం ఉదయం విద్యుత్ సరఫరా కు అంతరాయం
1 min read
స్థానిక ప్రజలు గమనించి సహకరించాలని మనవి
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.ఎం అంబేద్కర్ ఆపరేషన్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు మండలం ,33/11 కే వి ఏలూరు సబ్ స్టేషన్ పవర్ పేట సెక్షన్ పరిది లోని 11 కే వి పోణంగి మరియు వెంకన్న ట్యాంక్ ఫీడర్స్ లలోని చెట్లు కొమ్మలను తొలగిచుటకు మరియు లైన్లకు మరమ్మతు చేయుటకు గాను తేదీ.11.04.2025 (శుక్రవారం) నాడు ఉదయం 8.00AM గంటల నుండి 1.00PM గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయబడుననీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ఆపరేషన్ కె.యం.అంబేద్కర్ తెలిపారు.అందువల్ల పవర్ పేట సెక్షన్ ఏలూరు సబ్ స్టేషన్ పరిధి లో ఉన్న పడమర వీది, వంగాయ గూడెం ,గొల్లయ గూడెం ,గులాబీ తోట, కొబ్బరి తోట, సుబ్రహ్మణ్యం కాలనీ ,గాంధీ కాలనీ ,కాన్సర్ హాస్పిటల్ మరియు పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. కావున వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా కోరారు.