పవర్ స్టార్.. మూవీ రివ్యూ
1 min readచిత్రం: వకీల్ సాబ్
నటీనటులు: పవన్ కళ్యాణ్, ప్రకాశ్ రాజ్, శృతిహాసన్, నివేధా థామస్, అనన్య, అంజలి
దర్శకుడు: శ్రీరామ్ వేణు
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్
నిర్మాత: దిల్ రాజు
సమర్పణ: బోనీ కపూర్
విడుదల: 9-4-2021
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైంది. దీంతో పవన్ అభిమానుల ఉత్సాహానికి హద్దేలేకుండాపోయింది. థియేటర్లు పవన్ అభిమానుల ఆనందోత్సాహాలతో మార్మోగుతున్నాయి. వకీల్ సాబ్ మూవీ హిందీలో విడుదలైన పింక్ చిత్రానికి రీమేక్. మూలకథ ‘పింక్ ’ సినిమా నుంచి తీసుకున్నా.. తెలుగు నేటివిటీకి తగ్గకుండా సినిమాని నిర్మించడంతో.. వకీల్ సాబ్ మూవీ పట్ల క్రేజ్ అమాంతం పెరిగింది.
కథ: వివిధ ప్రాంతాలు.. వివిధ సామాజిక నేపథ్యాలు ఉన్న ముగ్గరు అమ్మాయిలు.. కుటుంబ పోషణ కోసం సిటిలో ఉద్యోగం చేస్తుంటారు. ఆ ముగ్గురు అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకుంటారు. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనే క్రమంలో పోలీస్ స్టేషన్ లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మధ్యతరగతి కుటుంబం.. అందులోను అమ్మాయిలు కావడంతో సమస్యను ఎదుర్కొలేకపోతారు. దీనికి తోడు రివర్స్ కేసుల్లో ఇరుక్కుంటారు. వీరికి అండగా పవన్ కళ్యాణ్ వాదిస్తారు. ప్రకాశ్ రాజ్ నిందితుల తరపున వాదిస్తారు. ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్ వాదనలు విన్న కోర్టు ఎవరి వైపు న్యాయం ఉందని నమ్మిందో?, ఎవరికి శిక్షపడిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: వకీల్ సాబ్ సినిమా మూల కథ ‘ పింక్’ చిత్రం నుంచి తీసుకున్నా.. పవన్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని చాలా మార్పులు చేశారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమకాలీన, సామాజిక సమస్యలను సినిమాలో ఇన్వాల్వ్ చేయడం సినిమాకు ప్లస్ అయింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ సినిమా అని చెప్పవచ్చు. ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్ మధ్య జరిగే కోర్టు సీన్లలో పవన్ కళ్యాణ్ తన విశ్వరూపం చూపించాడు. తన మార్క్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ప్రకాశ్ రాజ్, అంజలి, నివేధా థామస్, అనన్య కూడ చాలా బాగా నటించారు. సినిమా మొత్తం ఈ ముగ్గురు అమ్మాయిలు కేంద్రంగా ఉంటుంది. దర్శకుడు శ్రీరామ్ వేణు చాలా బాగా తెరకెక్కించారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద అసెట్ అని చెప్పవచ్చు. సంగీతం కూడ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ను తొలిప్రేమ, సుస్వాగతం సినిమాల్లో చూపించినట్టుగా..కొన్ని సీన్లలో చూపించారు. అప్పటి పవన్ కళ్యాణ్ ను గుర్తుచేశారు.
ముగింపు: ఒక సామాజిక సమస్యను కథాంశంగా తీసుకుని తెరకెక్కించారు. మోరల్ పోలీసింగ్ ద్వార వ్యక్తిత్వ నిర్ధారణ చేయడం గురించి ప్రధానంగా ఈ సినిమాలో చర్చించారు. పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా మంచి హిట్ అని చెప్పవచ్చు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల ఇతివృత్తంగా సినిమా మొత్తం నడుస్తుంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న తరుణంలో విడుదలైన సినిమా కావడం, అందులోను సామాజిక సమస్యలను సినిమాలో ప్రతిబింబించడం ద్వార సినిమా సక్సెస్ అని చెప్పవచ్చు.
సినిమా ఎలా ఉంది?: సినిమా బాగుంది.
గమనిక: ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.