PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

847′ ప్లేస్మెంట్స్ తో ‘అశోకా’ విద్యార్థినిల ‘ప్రభంజనం’…

1 min read

– ’10’ జాబ్ ఆఫర్స్ సాధించిన B.యువరాణి (ECE-IV)
– ‘7’కి పైగా జాబ్ ఆఫర్స్ సాధించిన ‘6’ స్టుాడెంట్స్
– ‘5’కి పైగా జాబ్ ఆఫర్స్ సాధించిన ’30’ స్టుాడెంట్స్
– ‘ఉమెన్స్’ కాలేజ్ కి ‘847’ ‘జాబ్ ఆఫర్స్’ లభించడం ‘రాయలసీమ’కే గర్వకారణం
– ‘ముఖ్యఅతిథి’ Ms.శోభనా కార్తీక్ (Mphasis HR Head- ఆలిండియా క్యాంపస్ రిక్రుాట్మెంట్)
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక దూపాడులోని ‘అశోకా’ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కి చెందిన ఫైనల్ ఇయర్-2023 విద్యార్థినిలకు రాయలసీమలోనే అత్యధికంగా ‘847’ జాబ్ ఆఫర్స్ లభించిన సందర్భంగా ఆదివారం నాడు ‘ట్రయంప్-2023′(ప్లేస్మెంట్స్ సక్సెస్ మీట్) ను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘అశోకా’ కాలేజ్ క్యాంపస్ లో నిర్వహించిన ‘ట్రయంప్-2023’ కార్యక్రమానికి ‘ముఖ్య అతిధిగా’ ‘Mphasis’ కంపెనీ క్యాంపస్ రిక్రుట్మెంట్ ఆలిండియా హెచ్.ఆర్(హెడ్) Ms.శోభనా కార్తీక్ హజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ..’దేశ వ్యాప్తంగా ‘రిక్రుాట్మెంట్స్’ ాలా నెమ్మదించాయని, అలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో సైతం ‘అశోకా’ విద్యార్థినిలు అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి ‘847’ జాబ్ ఆఫర్స్ సాధించడం, అందులో ’30’ మంది విద్యార్థినిలు ‘5’ కి పైగా జాబ్ ఆఫర్స్ సాధించడం ‘కర్నూలు’ జిల్లాతో పాటు ‘రాయలసీమ’ ప్రాంతానికే ఎంతో గర్వకారణమని, జాబ్ ఆఫర్స్ సాధించిన వారు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగించుకొని, ఉన్నత స్థాయి కి చేరుకోవడానికి కృషి చేయాలని’ తెలిపారు. అనంతరం టాప్ MNC లతో కలిపి మెుత్తం ’10’ జాబ్ ఆఫర్స్ సాధించిన ఫైనల్ ఇయర్ స్టుాడెంట్ ‘బి.యువరాణి(ECE-IV)’ తో పాటు, జాబ్ ఆఫర్స్ సాధించిన స్టుాడెంట్స్ అందరిని ‘ముఖ్య అతిధి’ Ms.శోభనా కార్తీక్, ‘అశోకా’ కాలేజ్ ఛైర్మన్ కే. అశోక్ వర్ధన్ రెడ్డి, డైరెక్టర్ డా.హరీష్ క్రిష్ణ, ప్రిన్సిపాల్ డా.నవీన్ ల చేతుల మీాదుగా మెుమెంటో లు అందించి అభినందించి మాట్లాడుతూ..మా ‘అశోకా’ విద్యార్థినిలకు ఫస్టియర్ నుండే విభిన్న రంగాలలో అపార అనుభవం కలిగిన ట్రైనింగ్ & ప్లేస్మెంట్స్ టీమ్ నుండి ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ట్రైనింగ్ అందిస్తామని, దీని వలన చాలా మంది స్టుాడెంట్స్ ధర్డియర్ ముగిసిలోగా ‘జాబ్ ఆఫర్స్’ అందుకొని, ఫైనల్ ఇయర్ ముగిసేలోగా మరిన్ని జాబ్ ఆఫర్స్ అందుకుంటున్నారని, అందువల్లనే ఇలాంటి అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ‘అశోకా’ ట్రైనింగ్ & ప్లేస్మెంట్స్ డీన్స్ జయకర్ జాన్సన్,విజయ్ అమల్ క్రిస్టీ లు మాట్లాడుతూ ‘రాబోయే రెండు నెలల్లో సైతం తమ కాలేజ్ నకు మరిన్ని కంపెనీలు రానున్నాయని, తమ స్టుాడెంట్స్ ప్లేస్మెంట్స్ ద్వారా త్వరలోనే ‘1000’ మైలురాయి ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు’.
ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్, పెద్ద సంఖ్యలో జాబ్ ఆఫర్స్ సాధించిన విద్యార్థినిలు పాల్గొన్నారు.

About Author