PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హాస్పిట‌ల్ లో ప్ర‌భాస్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా హాస్పిటల్‌లో దర్శనమిచ్చారు. ఆయనకి ఏమైంది? ఎందుకు హాస్పిటల్‌కి వెళ్లారు? అనే విషయాలు తెలియదు కానీ.. ఆయన హాస్పిటల్‌లో నడిచి వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన అభిమానులు ‘ప్రభాస్‌కు ఏమైంది?’ అంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే ‘బాహుబలి’ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కాలికి గాయమైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ గాయం నిమిత్తం యూరప్‌లో సర్జరీ కూడా చేయించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడదే గాయం మళ్లీ ఆయనని ఇబ్బంది పెడుతుందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా కూడా ప్రభాస్‌ని వైద్యులు పరీక్షించి దాదాపు 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలనేలా సూచనలు ఇచ్చినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరోసారి ప్రభాస్ ఇలా హాస్పిటల్‌లో దర్శనమివ్వడంతో.. మళ్లీ ఏమైందా? అని ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. అసలు ప్రభాస్‌కి ఏమై ఉంటుందనేది మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు.

                                

About Author