క్రమశిక్షణతో సాధన చేసి క్రీడల్లో రాణించాలి.. టీజీ భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడల్లో క్రమశిక్షణ, అంకితభావంతో సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టీజీ భరత్ అన్నారు. కర్నూల్ నగరంలోని ఎస్టిబిసి కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ప్రతాపరెడ్డి స్మారక హాకీ పోటీల సందర్భంగా క్రీడాకారులకు హాకీ బ్యాట్లతో పాటు క్రీడా దుస్తులను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ తండ్రి ప్రతాపరెడ్డి జ్ఞాపకార్థము ఆయన కుమారుడు విదేశాల్లో ఉంటూ నగరంలో హాకీ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా ప్రతాపరెడ్డి అందరికీ ఆదర్శప్రాయమని, చిన్నతనం నుంచి తనకు ఆయనతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువు ప్రతాపరెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. జీవితంలో క్రమశిక్షణకు ఉత్తమ వ్యక్తిత్వానికి ప్రతాపరెడ్డి ప్రతీకని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తులను గుర్తుంచుకొని మనలోని లోపాలను సరి చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు. తాను కూడా చిన్నతనంలో హాకీ తో పాటు అన్ని క్రీడల్లో పాల్గొన్నానని వివరించారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని వివరించారు. ముఖ్యంగా హాకీ క్రీడకు సంబంధించి బాడీ ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని వివరించారు. క్రీడల్లో క్రమశిక్షణ అంకితభావంతో ముందుకు సాగాలన్నారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన సహకారం తమ నుంచి ఎప్పుడు ఉంటుందని యువనేత టీజీ భరత్ వెల్లడించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు కిరణ్, ప్రదీప్ సామ్, మల్లికార్జున, శివశంకర్ భాస్కర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.