మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి సరైన సాధనం కరాటే సాధన..
1 min read
– దేశానికి ఉపయోగపడే క్రమశిక్షణ గల పౌరులుగా ఎదగాలంటే క్రీడల్లో సాధన అవసరం..
– ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ.పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ ని మించిన సాధనం మరొకటి లేదని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలో కరాటే శిక్షకుడు రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కరాటే బెల్టు గ్రేడింగ్ మరియు ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరాటే బెల్టు గ్రేడింగ్ లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బెల్టుల ప్రధాన ప్రధానోత్సవంతోపాటు ప్రశంసా పత్రాలను డాక్టర్ శంకర శర్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయడం వల్ల క్రమశిక్షణ, ఏకాగ్రత, అంకితభావం పెరిగి దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదుగుతారని చెప్పారు. కరాటే సాధన వల్ల మనిషికి ఆత్మస్థైర్యంతో పాటు ఏకాగ్రత అంకితభావం అలవాటు పడతాయని చెప్పారు. కరాటే సాధన చేయడం వల్ల సుదీర్ఘంగా శ్వాస తీసుకోవడంతో పాటు యోగ, ప్రాణాయామం, శారీరక శ్రమ, మెడిటేషన్ లాంటి పలు రకాల ఆరోగ్యానికి ఉపయోగపడే అలవాట్లు అలబడతాయని చెప్పారు .ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లు, డిజిటల్ మీడియా వంటి వాటికి మితిమీరి అలవాటు పడిపోయారని, దీని వల్ల చిన్న వయసులోనే శారీరక ,మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా చిన్న వయసులోనే ఉబకాయం వంటి సమస్యలు రావడం వల్ల బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని వివరించారు. వీటి స్థానంలో విద్యార్థులు ఖాళీ సమయాల్లో క్రీడల్లో సాధన చేయడం వల్ల శా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోను రాణించే అవకాశం మెండుగా ఉంటుందని చెప్పారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించడం వల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని, తల్లిదండ్రులు వీటిని గుర్తించి తమ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వివరించారుమ్ విద్యార్థులు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. మంచినీరు, పోషక విలువ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని ఆయన కోరారు .కర్నూల్ నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం నిరంతరం అందిస్తానని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులు నిరంతరం క్రీడల్లో సాధన చేయడం వల్ల చెడు అలవాట్లకు దూరంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన జీవనా న్ని సాగించవచ్చని ఇది వారి ఉజ్వల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తుందని చెప్పారు. విద్యార్థులు చదువులో ఉన్న ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు మంచి సాధనంగా ఉపయోగపడతాయని, క్రీడల్లో పాల్గొనడం వల్ల గెలుపు ఓటములను సమానంగా చూసి జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం అలవాటు పడుతుందని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వివరించారుమ్ ఈ కార్యక్రమంలో కరాటే శిక్షకుడు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.