ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ సంచార చికిత్స కార్యక్రమం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/16-7.jpg?fit=550%2C248&ssl=1)
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గార్గేయపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుచున్న ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ లో భాగంగా సంచార చికిత్స కార్యక్రమ నోడల్ అధికారి డాక్టర్,రఘు సందర్శించినారు అనంతరం మాట్లాడుతూ ప్రతి నెల 9 వ తేదిన ఉచితంగా షుగర్,hiv,VDRL,బ్లడ్ గ్రూపింగ్,హీమో గ్లోబిన్ తదితర పరిక్షలు చేస్తారని తెలిపారు,గర్భినిలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరిక్షలు చేయించుకోవాలని తెలిపారురక్తహినత నివారణకు క్రమము తప్పకుండా ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకోవాలన్నారు.వైద్య సిబ్బంది గర్భినిలను గుర్తించి ప్రారంభ దశ నుంచి ప్రసవంయ్యే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ,’ అలాగే కష్టతరమైనటువంటి గర్భిణిలను గుర్తించి 108 వాహనాన్ని ఉపయోగించుకోని సరైన సమయంలో చికిత్సలు అందేటట్లు చూడాలని సిబ్బందికి ఆదేశించినారు.పలు గ్రామాల నుండి వచ్చిన 32 గర్భినిలకు ఉచితంగా మందులు అందజేశారు ఈ కార్యక్రమములో డాక్టర్.హేమలత,డాక్టర్.అబ్దుల్ హమీద్,ఎంపిహెచ్ఈఓ వెంకట రమణ .స్టాఫ్ నర్సులు నిర్మల రాణి,శంషాద్ బాను,సామజిక ఆరోగ్య అధికారులు నమ్రత,రాధమ్మ,ఆశా కార్యకర్తలు మరియు ప్రోజేక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.
.