ప్రజా సంకల్ప యాత్రకు ఐదేళ్లు పూర్తి
1 min read– నవరత్నాలతో పేదలందరికీ సంక్షేమ ఫలాలు
పల్లెవెలుగు,వెబ్ కడప : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాద యాత్ర చేపట్టి నేటికి ఐదు సంవత్సరాలు ఆయన సందర్భంగా కడప మా సీమ సర్కిల్ నందు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా సిమ బాబు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిప్యూటీ సీఎం అంజద్ భాష, మాసీమ బాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ప్రజలలో మమేకమై వారి కష్టసుఖాలు నేరుగా వారి వద్దకే వెళ్లి తెలుసుకొని, ప్రజలకు ఏవైతే కార్యక్రమాలు చేపడితే వారు ఆర్థికంగా నిలబడతారో గ్రహించి, నవరత్నాలు ప్రకటించడం జరిగిందన్నారు, ఈ నవరత్నాలతో ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతుందని ఆనాడు ఆయన ప్రజలకు పాదయాత్రలో తెలియజేసిన మాట ప్రకారం, ప్రజలు వైఎస్ఆర్ సీపీకి బ్రహ్మానందం పట్టి 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం జరిగిందన్నారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత, నవరత్నాలను రాష్ట్రంలో గడపగడపకు అందజేయడం జరిగిందన్నారు, ఇందులో కుల మతాలకు అతీతంగా, పార్టీలకతీతంగా ఈ పథకాలను ప్రతి కుటుంబానికి చేరవేయడం జరిగిందన్నారు, అంతే కాకుండా గ్రామ సచివాలయాలు తీసుకువచ్చి, లక్షలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు, సంకల్ప పాద యాత్ర ఐదు సంవత్సరాలు ఆయన సందర్భంగా మా సినమ బాబు ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ అధ్యక్షులు పులి సునీల్ కుమార్, వైఎస్ఆర్సిపి నాయకులు ,కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.