ప్రజా సేవే పరమావధి- ఆళ్ళ నాని
1 min read– వంగాయగూడెం లో 125వ రోజు గడప గడపకు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రజా సేవే పరమావధిగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఆళ్ల నాని పేర్కొన్నారు. 125 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం 18వ డివిజన్,వంగాయగూడెంలో పర్యటించారు. ఇనపనూరి కేదారేశ్వరి జగదీష్ ఆధ్వర్యంలో కార్యక్రమం యూత్ సంబరాలతో అడుగడుగున ఆలనానికి నీరాజనాలు అర్పించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. స్థానికులు ప్రస్తావించిన పలు సమస్యల పరిష్కారించాలని యంత్రాంగానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం 125 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 125 కేజీల భారీ కేకును కోశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆళ్ల నాని కి జ్ఞాపికను అందచేశారు. తొలుత వంగాయ గూడెం కూడలిలోని బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి, వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, కో ఆప్షన్ సభ్యులు మున్నులు జాన్ గురునాథ, కార్పొరేటర్ ఇనపనూరి కేదారేశ్వరి జగదీష్ , మేరుగు నానిబాబు, మేరుగు సత్యనారాయణ, పాత పెద్దిరాజు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెదబాబు, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ , డిప్యూటీ మేయర్లు నూకపెయ్యి సుధీర్ బాబు, గుడిదేసి శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి మంచెం మైబాబు, నగర కమిషనర్ వెంకటకృష్ణ, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.