PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా శ్రేయస్సే – ప్రభుత్వం ధేయ్యం…

1 min read

వందవాగిలి సంక్షేమ పథకాలు మొత్తం 17కోట్లు 66 లక్షల 44 వేలు లబ్ధి చేకురాయి.:-

గ్రామంలో డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు కోరకు ప్రణాళికలు సిద్ధం చేయండి.:-

జగనన్న సంపూర్ణ పోషణ పథకం లో బాగంగా కిట్టులను చిన్నారులకు, బాలింతలకు పంపిణీ చేసిన మంత్రి.:-

బసవన్న దేవాలయానికి రూ. 2 లక్షలు విరాళం అందజేసిన మంత్రి.:-

తెలుగుదేశం మాజీ ఎంపీపీ హెబ్బటం రాజగోపాల్ రెడ్డి,మరియు తన అనుచరులతో మంత్రి గుమ్మనూరు జయరాం సమక్షంలో వైస్సార్సీపీ పార్టీలో చేరిక..

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు.:-

పల్లెవెలుగు, వెబ్  ఆలూరు: ప్రజా శ్రేయస్సే – ప్రభుత్వం ధేయేమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి  పేర్కొన్నారు. శుక్ర వారం హోళగుంద మండలం వందవాగిలి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులకి బాణసంచా, శాలువాలు,పూలమాలతో,  గ్రామ ప్రజలు, నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘణ నివాళులర్పించారు. అనంతరం గ్రామ సచివాలయన్ని తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి మంత్రి ఆరా తీశారు. సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ… ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని సచివాలయ సిబ్బందికి మంత్రి సూచించారు…. ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే వాలంటీర్ – గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుచేసి సచివాలయాల ద్వారా ఇంటి ముంగిటకే పాలన…దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చింది. అవినీతికి కానీ, వివక్షతకు కానీ తావు ఇవ్వకూడదని, పరిపాలన అన్నది ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని అన్నారు.  గ్రామ,వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులో  ఉండటం ద్వారా ప్రజలకు నేరుగా గ్రామస్థాయిలోనే మెరుగైన సేవలు సచివాలయం ద్వారా పొందడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలేదని బాధపడే సమస్య ఇకపై ఉండదు.ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలు ప్రజలు బాగా సద్వినియోగం చేసుకోనులా సచివాలయం సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం! ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.  అనంతరం మంత్రివర్యులు గ్రామంలో జగనన్న సంపూర్ణ పోషణ పథకంలో  భాగంగా గర్భిణీలకు చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న కిట్టును పంపిణీ చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ… గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం సత్ఫలితాలనిస్తోంది. ప్రభుత్వ ఆశయం నెరవేరుతోంది. పేదరికంతో గర్భిణులు సరైన పైష్టికాహారం తీసుకోకపోవడంతో రక్తహీనతకు గురవుతున్నారు. వారికి పుట్టిన బిడ్డలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం అదనపు పౌష్టికాహారం అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం  వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలులోకి తెచ్చింది. గర్భిణులకు గతంలో ఇచ్చే పప్పు, పాలు, గుడ్లకు అదనంగా మరో ఆరు రకాల పోషక పదార్థాలను అందించడంతో వారిలో రక్తహీనత తగ్గుతోంది. ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిస్తున్నారు.గర్భిణులకు ‘సంపూర్ణ పోషణ’*  గర్భిణులు, బాలింతలకు ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేస్తోంది. కిలో రాగిపిండి, కిలో అటుకులు, 250 గ్రాముల వేరుశనగ చక్కి, కిలో జొన్నపిండి, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల ఎండు ఖర్జూరం, 3 కిలోల ఫోర్టిఫైడ్‌ రైస్, అరకిలో నూనె, అరకిలో పప్పు, 5 లీటర్ల పాలు, 25 కోడిగుడ్లతో కూడిన కిట్టలను అందజేస్తోంది. వీటన్నింటినీ డ్రైరేషన్‌గా లబ్ధిదారులకు ప్రతీనెలా సరఫరా చేస్తోంది.పిల్లల ఆరోగ్యం కోసం…ఏడు నెలల నుంచి మూడేళ్ల వయస్సుగల పిల్లలకు నెలకు రెండున్నర కిలోల బాలమృతం, రెండున్నర లీటర్ల పాలు, 25 కోడిగుడ్లను ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం సమకూర్చుతోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహరాన్ని వంటచేసి పిల్లలకు వడ్డిస్తోంది. చిన్న పిల్లలకు సోమవారం, గురువారాల్లో పౌష్టికా హారం, కూరగాయల కూర, సాంబారు, కోడిగుడ్డు కూర, వంద లీటర్లపాలు, మంగళవారం, శుక్రవారా ల్లో పౌష్టికాహారం, పప్పు, తోటకూర, కోడిగుడ్డు, 100 ఎంఎల్‌ పాలు, బుధ, శనివారాల్లో పౌష్టికాహారం, వెజిటబుల్‌ రైస్, పులిహోరా, గోంగూర కూర, కోడిగుడ్డు, 100 ఎంఎల్‌ పాలుతో కూడిన మెనూను అమలు చేస్తున్నారు. అనంతరం మంత్రివర్యులు గ్రామంలో   పర్యటిస్తూ మూడున్నర ఏళ్ళ పాలనలో రాష్ట్రంలోని ప్రతి గడపలో అర్హతల ప్రకారం సంక్షేమ ఫలాలు లభించాయని మంత్రి  అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే నూతన ఒరవడికి సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి  శ్రీకారం చుట్టారన్నారు.  నేడు మన జగనన్న ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూర్చుతోందన్నారు. పారదర్శక పాలన అంటే ఇదే అని పేర్కొన్నారు. సంక్షేమ ఫలాల ద్వారా హోళ గుంద మండలo వందవాకిలి పంచాయతీలోనే  దాదాపు మొత్తం 17 కోట్లు 66 లక్షల 44 వేల రూపాయలను  అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పైసా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు.  అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపన, తాపత్ర­యంతో ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న సురక్ష’. ఇప్పటికే రాష్ట్రంలో శాచ్యురేషన్‌ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేసిన జగనన్న ప్రభుత్వం.. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ఈ ‘జగనన్న సురక్ష‘ ద్వారా ఇంటింటినీ దర్శించింది. తద్వారా వారికి లబ్ధి చేకూర్చడంతో పాటు వారికింకేమైనా సర్టిఫికెట్లు (జనన, మరణ, కుల, సీసీఆర్సీ, రేషన్‌ కార్డు డివిజ­న్, హౌస్‌ హోల్డ్‌ డివిజన్, ఇన్‌కమ్‌ మొదలైన 11 రకా­లు ధ్రువీకరణపత్రాలు) అవసరమైతే సర్వీస్‌ ఫీజు లే­కుండా వాటిని ఉచితంగా అందించనుంది. కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా.. లంచాలకు, వి­వక్షకు తావులేకుండా.. నూటికి నూరు శాతం  సంతృప్త స్థాయిలో పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దే­శంలో ఎక్కడాలేని విధంగా ప్రతి ఇంటికీ వెళ్లి స­మస్యలేమైనా ఉంటే తెలుసుకుని పరిష్కారం చూపించే దిశగా చేస్తున్న వినూత్న కార్యక్రమం ఈ ‘జగనన్న సురక్ష పథకం ద్వారా *జిల్లాలో జూలై ఒకటవ తేదీ నుండి జూలై 31 వ తేదీ వరకు నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా జిల్లా లోని 672 సచివాలయాల పరిధిలో ఇంటింటికీ వెళ్లి   4,38,208 సర్వీసులు గ్రామ పంచాయతీ లో సుమారు 500 మందికి  ఎలాంటి సర్వీస్ చార్జీ లు లేకుండా ప్రజలకు ఉచితంగా  దరఖాస్తు చేసుకున్న వారందరికీ కుల, ఆదాయ, 11 రకాలైన పత్రాలను పైసా అవినీతి లేకుండా దరఖాస్తు చేసుకునేవారికి అందజేయడం జరిగింది అన్నారు.గ్రామంలో నిర్మాణంలో ఉన్న బసవన్న దేవాలయాన్ని పనులను పరిశీలించి దేవాలయం నిర్మాణం కొరకు రెండు లక్షల రూపాయలను విరాళం అందజేశారు. గ్రామంలో అభివృద్ధి పనుల కొరకు రూ 20 లక్షల వ్యయoతో గ్రామంలో రోడ్డు డ్రైనేజీల కొరకు ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు మంత్రివర్యులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి గారు,గుమ్మనూరు శ్రీనివాసులు గారు,ఎంపీపీ తనయుడు ఈషా, జడ్పీ వైస్ ఛైర్మన్ బావ శేషాప్ప, వైస్ ఎంపీపీలు కాంచప్ప, హనుమప్ప, మల్లికార్జున, ఎంపీటీసీ భర్త లక్ష్మీకాంత్ రెడ్డి,సింగిల్ విండో ఛైర్మన్ మల్లికార్జున మాజీ జడ్పీటీసీ రాంభీ నాయుడు, నాయకులు మేలిగిరి, నాగప్ప, మల్లికార్జున,గిరి,వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,సచివాలయం సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author