PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘మా’ అధ్యక్ష ఎన్నిక‌లు… బ‌రిలో ప్రకాశ్ రాజ్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల పోరు ర‌స‌వ‌త్తరంగా మార‌బోతోంది. త్వర‌లో జ‌ర‌గ‌బోయే ‘ మా ’ ఎన్నిక‌ల్లో అధ్యక్ష ప‌ద‌వికి విల‌క్షణ న‌టుడు ప్రకాశ్ రాజ్ పోటీ చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు. అయితే.. ఇందు కోసం చిరంజీవి మ‌ద్దతు కోరుతున్నారా ? అన్న ప్రశ్నకు ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు. చిరంజీవి అంద‌రివాడ‌ని, కొంద‌రికే మ‌ద్దతిస్తార‌ని అనుకోన‌ని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఇండ‌స్ట్రీకి మంచి చేసేవారికి చిరంజీవి మ‌ద్దతు ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యాన్ని మా ఎన్నిక‌ల కోసం ఉప‌యోగించుకోన‌ని ప్రకాశ్ రాజ్ చెప్పారు. అయితే.. ప్రకాశ్ రాజ్ కు మెగా బ్రద‌ర్ నాగ‌బాబు మ‌ద్దతు తెలిపారు. ప్రకాశ్ రాజ్ లాంటి న‌టుడు అధ్యక్ష ప‌ద‌వికి పోటీ చేస్తే ఇండ‌స్ట్రీకి మంచి జ‌రుగుతుంద‌ని నాగ‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రకాశ్ రాజ్ లాంటి వ్యక్తి మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కు అవ‌స‌ర‌మ‌ని నాగ‌బాబు అన్నారు.

About Author