PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : విల‌క్షణ న‌టుడు ప్రకాశ్ రాజ్ మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫ‌ర్ పోనీ వ‌ర్మతో మ‌రోసారి ఏడ‌డుగుల బంధంలోకి అడుగుపెట్టాడు. పోనీవ‌ర్మతో మ‌ళ్లీ పెళ్లేంటి.. 2010లోనే వారిద్దరికీ పెళ్లయింది క‌దా అని అనుకుంటున్నారా ?. అవును వారిద్దరికీ 2010లోనే పెళ్లయింది. మొద‌టి భార్య ల‌లిత కుమారికి విడాకులు ఇచ్చాక పోనీవ‌ర్మని ప్రకాశ్ రాజ్ పెళ్లి చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు జ‌రిగింది మాత్రం ఉత్తుత్తి పెళ్లి. ప్రకాశ్ రాజ్ కుమారుడు వేదాంత్ కోరిక మేర‌కు ప్రకాశ్ రాజ్ ,పోనీ వ‌ర్మ మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు. త‌మ పెళ్లికి సాక్షిగా త‌మ కొడుకు వేదాంత్ ఉండాల‌ని కోరుకున్నాడ‌ని, అందుకే ఈ రాత్రి మేం మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నామ‌ని ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. త‌న భార్య పోనీవ‌ర్మ పిల్ల‌లో దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.


About Author