NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మోదీ పై ప్ర‌కాశ్ రాజ్ సెటైర్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ న‌టుడు ప్రకాశ్ రాజ్ తాజాగా మరోసారి మోదీని ఉద్దేశించి సెటైర్లు వేశారు. ప్రకాశ్ రాజ్ తాజాగా చేసిన ట్వీట్‌లో.. వినాయక చవితి సందర్భంగా ప్రధాని మోదీ రూపంలో ఉన్న విగ్రహాలు, ఆర్ఎస్‌ఎస్ రూపంలో, పుష్పలోని అల్లు అర్జున్‌లాగా, కేజీఎఫ్ 2‌లో యశ్‌లాగా పలు విగ్రహాలను షేర్ చేశాడు. అలాగే.. వినాయకుడితో మోదీపక్కనే కూర్చున్నట్లు, అలాగే ఇతర సినిమాల్లోని ఫేమస్ పాత్రలో రూపంలో ఉన్న వినాయక విగ్రహాలను కూడా షేర్ చేశాడు. ఆ పోస్టుకి.. ‘ఇవి మీ నమ్మకాలను దెబ్బతీయడం లేదా’ అని సెటైరికల్‌గా రాసుకొచ్చాడు. ఈ పోస్టు సైతం ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. కొందరూ ప్రకాశ్ రాజ్‌కి అనుకూలంగా.. మరికొందరూ వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.

                               

About Author