NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిరంజీవిని క‌లిసిన ప్రకాశ్ రాజ్.. ఎన్నిక‌ల్లో మ‌ద్దుతు కోస‌మేనా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ న‌టుడు ప్రకాశ్ రాజ్ .. మెగాస్టార్ చిరంజీవిని క‌లిశారు. త్వర‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో వీరి క‌ల‌యిక ఆసక్తిక‌రంగా మారింది. ప్రకాశ్ రాజ్ అధ్యక్ష స్థానానికి పోటీ ప‌డుతున్న సంద‌ర్భంలో వీరి భేటీ వేడి పుట్టిస్తోంది. మా ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈరోజు ఉద‌యం చిరంజీవిని క‌లిసిన‌ట్టు ప్రకాశ్ రాజ్ ట్విట్టర్లో వెల్లడించారు. బాస్ తో జిమ్ లో భేటీ అయ్యాన‌ని, స‌మ‌స్యల పరిష్కారానికి ఆయ‌న చూపిస్తున్న చొర‌వ స్పూర్తిదాయ‌క‌మ‌ని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. దీంతో మా ఎన్నిక‌ల్లో ఆస‌క్తిక‌రంగా మారాయి. చిరంజీవి ఇప్పటి వ‌ర‌కు ఎవ‌రికీ మ‌ద్దతు తెలిప‌న‌ప్పటికీ.. నాగ‌బాబు ప్రకాశ్ రాజ్ కు మ‌ద్దతు తెలిపారు.

About Author