గోవా సీఎంగా ప్రమోద్ సావంత్.. రెండోసారి అవకాశం !
1 min readపల్లెవెలుగువెబ్ : గోవా ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమోద్ సావంత్కే అవకాశం లభించింది. పానాజీలో సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమోద్ సావంత్ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గాను బీజేపీ 20 స్థానాలు గెలుచుకుంది. ఇద్దరు ఎంజీపీ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.