PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నవంబర్ 3,4,5 వ  తేదీల్లో  ప్రాన్స్ అండ్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్

1 min read

– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన

పల్లెవెలుగు వెబ్  కర్నూలు : నవంబర్ 3,4,5 వ  తేదీల్లో కర్నూలు నగరం లోని రావూరి గార్డెన్ లో ప్రాన్స్ అండ్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు  జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో  కర్నూలు- హైదరాబాద్  హై వే లో కల్లూరు ఎస్టేట్ సమీపంలోని రావూరి గార్డెన్స్ లో  నిర్వహించనున్న ప్రాన్స్ అండ్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కు సంబంధించిన వాల్ పోస్టర్ల ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్య శాఖ ఆధ్వర్యంలో  నిర్వహించనున్న  ప్రాన్స్ అండ్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు… చేపలు, రొయ్యల వినియోగం పెంచడం, వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం కోసం  ఈ ఫిష్ – ఫ్రాన్స్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరుగుతోందని కలెక్టర్ తెలియజేశారు. అంతే కాకుండా ఆసక్తి కల వారు మత్స్య రంగంలో గల ఉపాధి అవకాశాల గురించి కూడా తెలుసుకోవచ్చని సూచించారు.. నగర ప్రజలు ఈ ఫెస్టివల్ లో  పాల్గొనాలని  కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ ఉపసంచాలకులు శ్యామల తదితరులు పాల్గొన్నారు.

About Author